పిల్లలమర్రిలో రూ.28 లక్షలతో బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన
సూర్యాపేట రూరల్, జూన్ 12: సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామాభివృద్ధిలో భాగంగా రూ.28 లక్షల నిర్వహణ, సంరక్షణ నిధులతో నిర్మించనున్న డబుల్ లైన్ రోడ్డు బ్రిడ్జ్ పనులకు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాదిలు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామస్తుల తాగునీటి అవసరాల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ను సైతం ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. పిల్లలమర్రి అభివృద్ధియే లక్ష్యంగా గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో 11వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు యాదవ్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీమ్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, వెక్కంటి శేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎడ్ల గంగాభవాని, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ నాయుడు, సేవాదళ్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, శివాలయం ఛైర్మన్ కొండ వెంకన్న, కాంట్రాక్టర్ పాల్గొన్నారు.






