23 July, 2026 | 1:50 AM

ఫుడ్ గ్రీన్ స్టోరేజ్ భవనానికి శంకుస్థాపన

23-07-2026 12:00 AM

మఠంపల్లి జులై 22: మండల కేంద్రములో ఫుడ్ గ్రీన్ స్టోరేజ్ హల్ ను బుధవారం స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మఠంపల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ సమీప వెంచర్లు ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులతో సుమారు 30 లక్షల వ్యయంతో ఈ భవన నిర్మాణం జరుగుతుందని, రానున్న రోజుల్లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాని మరింత అభివృద్ధి చెస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి శౌరి,వార్డు సభ్యులు వల్లపుదాసు జోసు,అరుణ, చిలకమ్మా కాటేపల్లి,నాగరాజు బుచ్చయ్య,వెంకటేశ్వర్లు, వీరబాబు,ఏసుమల్ల రాములు, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.