విద్యార్థులకు వీ2 ఫౌండేషన్ చేయూత
బ్యాగుల పంపిణీలో శేరికర్ రమేష్ చొరవ
నాగల్గిద్ద, ఆగస్టు 23: మండలంలోని కరస్ గుత్తి, ఎనకపల్లి, ఉత్పల్లి లస్కారి తండా ఎంపీపీఎస్ పాఠశాలల్లో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీ2 హెల్ప్ యూ ఫౌండేషన్, దగ్రూప్ ఫర్ నీడీ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. కరస్ గుత్తి లో కృష్ణ ప్రసాద్ ఎనకపల్లి లో ధివ్యా సహకారం, విరాళంతో పాటు పీఆర్టీయూ మండల అధ్యక్షులు శేరికర్ రమేష్ చొరవతో బ్యాగులు అందజేశారు.
కార్యక్రమంలో ఎంఈవో మన్మధ కిషోర్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ హీరమన్, రాఘవేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ రావు, మండల ప్రధాన కార్యదర్శి జీవన్ రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఎనకపల్లి పాఠశాలలో ధివ్యా సహకారంతో, కృష్ణ ప్రసాద్ సార్ ప్రత్యేక చొరవతో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నవీన్, రవీందర్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న వీ2 ఫౌండేషన్ సేవలను పాఠశాల సిబ్బంది అభినందించారు.






