24 August, 2026 | 2:11 AM

మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్సే అడ్డు

24-08-2026 01:41 AM
  1. చట్టసభల్లో 33శాతాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం
  2. అంబేద్కర్, సంత్ రవిదాస్ ఆశయాలకు విరుద్ధం
  3. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి n హిందువుల ఐక్యతే బీజేపీ లక్ష్యం
  4. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
  5. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఘనంగా సంత్ శిరోమణి, గురు రవిదాస్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో, అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంటే, కాంగ్రెస్, ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంబేద్కర్, సంత్ రవిదాస్ ఆశయాలకు విరుద్ధమన్నారు. దేశంలోని అన్ని గ్రామాలు, తండాలు, దళితవాడలకు విద్యుద్దీకరణ, రహదారి కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి వెనుకబడిన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. హిందువుల ఐక్యతే బీజేపీ లక్ష్యమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

 నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన సంత్ శిరోమణి, గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ కలశ యాత్ర సాగింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...సంత్ రవిదాస్ ప్రబోధించిన సామాజిక సామరస్యతే బీజేపీ విధానమన్నారు.

సంత్ రవిదాస్ భక్తి ఉద్యమం ద్వారా సమాజంలో చైతన్యం, సామాజిక సమానత్వం తెచ్చేందుకు కృషి చేసిన మహోన్నత ఆదర్శమూర్తి అని కొనియాడారు. 650 ఏళ్ల క్రితం ఆయన అందించిన సమసమాజ సందేశం నేటికీ భగవద్గీతలా మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు. మనిషికి గొప్పతనం పుట్టుకతోనో, కులంతోనో, ఆర్థిక స్థోమతతోనో రాదని.. ఆలోచన, ఆచరణ, సమాజ సేవ ద్వారానే లభిస్తుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఉదాహరిస్తూ ఆయన  చేశారు. 

25 కోట్ల మంది పేదరిక నిర్మూలన

ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంత్ రవిదాస్ ఆశయాలు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ స్ఫూర్తితోనే పాలన సాగిస్తోందని తెలిపారు. గత పదకొండేళ్లలో దేశవ్యాప్తంగా చేపట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాల ద్వారా సుమారు 25 కోట్ల మంది పేదరిక నిర్మూలన జరిగిందని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పేద, దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ 12 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు.

‘హర్ ఘర్ జల్’ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇప్పటికే 4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి అధిక శాతం దళిత కుటుంబాలకే అందించామని తెలిపా రు. దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది పేదలకు 5 కేజీల ఉచిత బియ్యం, ఆయుష్మాన్ భారత్ ద్వారా నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు ప్రతి దళితవాడ, బీసీ బస్తీ, గ్రామ గ్రామాన సంత్ రవిదాస్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పేదలకు అంకితభావంతో సేవలందించి ఆయన ఆశయ సాధనకు పునరం కితం కావాలని పిలుపునిచ్చారు. 

హిందువుల ఐక్యతే బీజేపీ లక్ష్యం: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

కుల, మతాలకు అతీతంగా సమసమాజ నిర్మాణం ఐక్యతే బీజేపీ లక్ష్యమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కులాల పేరుతో హిందూ సమాజాన్ని విభజించే కుటిల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టా లని ఆయన పిలుపునిచ్చారు. కుల భేదాలను పక్కనపెటి ్ట హిందువులంతా ఒకే సమాజంగా ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కులాలు, వర్గాలకు అతీతంగా హిందు వులంతా సోదరభావంతో  దేశ రక్షణ, ఐకమత్యం, అభివృద్ధి కోసం నవభారత నిర్మా ణంలో భాగస్వాములు కావాలన్నారు.