calender_icon.png 10 November, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెజార్టీతో నవీన్ యాదవ్‌ను గెలిపించాలి

10-11-2025 12:19:07 AM

పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): భారీ మెజార్టీతో నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఎక్సైజ్ శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఆదివారం బోరబండ శంకర్‌లాల్ షంషీర్ ఫంక్షన్ హాల్ లో బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి గూడలో పద్మశాలిల ఓట్లు 10 వేలు ఉన్నాయని వారందరూ కూడా బీసీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు వేయాలని కోరారు.

ఈ ప్రాంతంలో మార్కండేయ దేవాలయం ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పద్మశాలీలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాముఖ్యత ఇస్తామన్నారు. మగ్గా ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చె ప్పారు. పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరస్వామి మాట్లాడుతూ.. తమ వర్గానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగు లు ఎక్కువగా ఉన్నందున లోన్స్ ఇచ్చి వానాల్లో బిజిలి వాహనాల ద్వారా బట్టలు అమ్ముకునే వారికి వాహన సదుపాయాలు కల్పించాలని కోరారు.

బీసీ రాజ్యాధి కార సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ మాట్లాడుతూ.. పద్మశాలీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మా ట్లాడుతూ.. పద్మశాలీల సమస్యల సాధన కోసం కృషి చేస్తామన్నారు. పద్మశాలీలు నవీన్‌ను ఓటేసి గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోరారు. కార్యక్రమంలో పద్మశాలీల కుల సంఘాల నేతలు వీరస్వామి జగదీష్, లక్ష్మణ్, నగర కాంగ్రెస్ మహిళ మాజీ అధ్యక్షురాలు వరలక్ష్మి, బీసీ రాజ్యాధికార సమితి సీఈఓ సరస్వతి, వెంకటేశ్వర్లు శ్రీనివాస్ ఆదిత్య దాస్ పాల్గొన్నారు.