2 July, 2026 | 3:02 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

ఆర్మీ రహస్య ప్రాంతంలో ఫోటోలు, వీడియోలు తీసిన నలుగురు అరెస్ట్

20-06-2025 08:30 AM

తిరుమలగిరిలో నలుగురు అరెస్ట్

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) ఆర్మీ ఆధీనంలోని ప్రాంతంలోకి చొరబడిన నలుగురు అరెస్ట్ అయ్యారు. తిరుమలగిరిలో ఎంసీఈఎంఈలోని(MCEME) టెక్నో చౌక్ గేటులోకి నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. నకిలీ వైమానికదళ అధికారి గుర్తింపు కార్డులతో అనుమతి లేకుండా ప్రవేశించారు. ఆర్మీ రహస్య ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారంపై ఫొటోలు, వీడియోలు తీసుకోవడంపై పట్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. లెఫ్టినెంట్ కల్నల్(Lieutenant Colonel) ఫిర్యాదులో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి విచారిస్తున్నారు.