2 July, 2026 | 4:11 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఆక్స్‌ఫర్డ్ సదస్సులో పాల్గొననున్న కేటీఆర్

20-06-2025 08:19 AM

హైదరాబాద్:  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) యూకే పర్యటిస్తున్నారు. ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో(Oxford University) ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో జరిగే సదస్సులో కేటీఆర్ పాల్గొననున్నారు.  ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా ఫోరమ్‌లో భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు (ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా) అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు.