10 March, 2026 | 5:39 AM

సమగ్ర సమాజ నిర్మాణమే లక్ష్యం

07-03-2026 12:01 AM
  1. ఓయూవైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగారం

బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి

జాజుల శ్రీనివాస్ గౌడ్

సికింద్రాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): సామాజిక న్యాయం, సమానత్వం, సరైన ప్రాతినిధ్యం అనేవి శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పునాదులని ఉస్మానియా యూనివ ర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం అన్నారు. చారిత్రక కారణాల వల్ల వెనుకబడిన వర్గాలకు విద్య, ఉపాధి, పాలనలో సమాన అవకాశాలు కల్పించి, సమగ్ర సమాజాన్ని నిర్మించడమే భారత రాజ్యాంగ లక్ష్యమని కుమార్ పేర్కొన్నారు.

ఉస్మా నియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణలో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు సామాజిక న్యా యం విధానాలు సవాళ్లు భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై శుక్రవారం రూసా 2.0 సౌజన్యంతో జాతీ య సదస్సు నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దామాషా ప్రకారం తగిన ప్రాతినిధ్యం లభించాలంటే వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పిం చాలనే డిమాండ్ న్యాయమైనదని పేర్కొన్నారు.

ఈ సదస్సులో రాజనీతి శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్ట ర్ చలమల్ల వెంకటేశ్వ ర్లు కన్వీనర్గా వ్యవహరించిన ఈ సదస్సుకు హాజరైన వీసీ ప్రొఫె సర్ కుమార్, బీసీ ఐఎఫ్ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, ప్రముఖ వి ద్యావేత్తలు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ ఎస్. సుదర్శన్ రావు ,ప్రొఫెసర్ ఎం. స్వర్ణలత ముఖ్య వక్తలుగా పాల్గొని బీసీ రిజర్వేషన్ల ,చారిత్రక, రాజ్యాం గ, రాజకీయ, సామాజిక-ఆర్థిక అంశాలపై లోతైన విశ్లేషణ చేశారు. ఈ కార్యక్రమాన్ని రాజనీతి శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు కన్వీనర్గా, విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎం. కృష్ణ కుమార్ కో-కన్వీనర్గా నిర్వహించారు. డాక్టర్ సబావత్ రవి కూడా కో-కన్వీనర్గా వ్యవహరించారు.