ఫోర్ లేన్ పనులు ప్రారంభించాలి
మంత్రికి మర్రి విజ్ఞప్తి
ఇబ్రహీంపట్నం (ఆగస్టు 10): ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గేట్ గురునాన కళాశాల నుంచి మాల్ వరకు రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆదిభట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాదు నుంచి నాగార్జునసాగర్ లో నిర్వహించే నిర్ణయానికి వెళ్తున్న మంత్రి ఇబ్రహీంపట్నంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనతో మాట్లాడి తమ ప్రాంత సమస్యలను విన్నవించారు.
ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గేట్ నుంచి గురునానక్ కాలేజీ మీదుగా మాల్ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్తో కూడిన ఫోర్లైన్ రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని కోరారు. రోజువారీ వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగుల ప్రయాణంతో రహదారిపై తీవ్ర ట్రాఫిక్ రద్దీ పెరిగి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలపగా, నిన్న తక్కలపల్లి వార్డు మెంబర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజల భద్రత కోసం ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకం వంట సిబ్బందికి గ్యాస్ సిలిండర్లు కేటాయించాలని వినగా, మంత్రి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి హెచ్‌ఏఎమ్ పథకం ద్వారా నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.






