పూజల పేరుతో మహిళల మోసం
బైంసా, జూలై 28 (విజయ క్రాంతి): పూజలు చేసి వ్యాధులు నయం చేస్తామని చెప్పి మోసానికి, చోరీకి పాల్పడిన ఇద్దరు మహిళలను భైంసా రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు బైంసా రూరల్ కుమార్ తెలిపారు. సిఐ కథనం ప్రకారం మండలంలోని కోతలుగాం గ్రామంలో చందూర్ వారి దత్తాత్రే కుటుంబంలో సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో వారి బలహీనతను గుర్తించిన బైంసా పట్టణానికి చెందిన సాయవ్వ, శాంతాబాయి అనే మహిళలు వారింటికి వెళ్లి పూజలు చేసి రోగం నయం చేస్తామని మభ్యపెట్టారు. వారింట్లోని రూపాయలు 15 వేలు విలువైన వెండి కడియాలను అపహరించారు. వాస్తవాన్ని గుర్తించిన బాధితులు బైంసా గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సుప్రియ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్టు తెలిపారు.






