5 June, 2026 | 1:11 AM

కీళ్ల ఆరోగ్యంపై ఉచిత పుస్తకం

05-06-2026 12:00 AM

విడుదల చేసిన స్టార్ హాస్పిటల్స్ 

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): మారిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా కీళ్ల సమస్యలు వేగం గా పెరుగుతున్న క్రమంలో ’స్టార్ హాస్పిటల్స్’ ఒక కీలకమైన ప్రజారోగ్య పుస్తకాన్ని ఆవిష్కరించింది. ‘ది హ్యూమన్ బోన్ జా యింట్స్ ఎక్స్పె్లయిన్డ్‘ పేరుతో రూపొందించిన ఈ ఉచిత పుస్తకాన్ని బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్స్‌లో గురువారం విడుదల చేశారు.

స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నీలం వి.రమణరెడ్డి 25 సంవత్సరాల సుదీర్ఘ క్లినికల్, రోబోటిక్ అనుభవంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయన చికిత్స ద్వారా నొప్పుల నుంచి వి ముక్తి పొంది, తిరిగి సాధారణ జీవితాన్ని గ డుపుతున్న ముగ్గురు లబ్ధిదారులైన రోగులే ముఖ్య అతిథులుగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం. కీళ్ల కండరాల పనితీరు ను, కీళ్లు ఎందుకు శబ్దాలు చేస్తాయనే విషయాలను సామాన్యులకు సైతం అర్థమయ్యే లా వివరించారు.

బరువు నియంత్రణ, ఒమే గా-3 ఆహార నియమాలు, కూర్చునే పద్ధతు లు, మరియు ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాల గురించి నిపుణుల సలహాలు అందిం చారు. వేళ్లు విరవడం వల్ల ఆర్థరైటిస్ రాదనే నిజాలను స్పష్టం చేస్తూ, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల మన్నికపై ఉన్న భయాలను తొ లగించారు.

రోబోటిక్ శస్త్రచికిత్సలు, వేగంగా కోలుకోవడంలో కృత్రిమ మేధస్సు పాత్రను వివరించారు. ‘జీవించడం అంటే కదలడం.. మీరు ఎప్పటికీ చేయించుకోవాల్సిన అవస రం రాని శస్త్రచికిత్సే ఎల్లప్పుడూ అత్యుత్తమ మైనదని డాక్టర్ రమణారెడ్డి పేర్కొన్నారు.