కామినేనిలో బాలుడికి చికిత్స
- కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి మెరుగైన చికిత్స
- కోలుకున్న ఏడేళ్ల అద్విక్
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఏడేళ్ల బాలు డు కామినేని ఆసుపత్రి వైద్యుల అత్యవసర, క్రిటికల్ కేర్, రీకన్స్ట్రక్టివ్ చికిత్సతో పూర్తిగా కోలుకున్నాడు. కోలుకున్న బాలుడిని గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అ ద్విక్ అనే ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్కల గుం పు దాడి చేయడంతో తలపై చర్మం పెద్దఎత్తున ఊడిపోవడం, శరీరంపై లోతైన గాయా లు కావడమే కాకుండా తీవ్ర రక్తస్రావమైంది.
ఈ స్థితిలో బాలుడిని కామినేని ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి బాలుడు షాక్లో ఉండగా రక్తపోటు కూడా నమోదు కాని స్థితిలో ఉండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని వైద్యులు తెలిపారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే బాలుడికి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూ నిట్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.
ఈ కేసు గురించి కామినేని ఆసుపత్రి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ కాంచన్ ఎస్ చన్నావర్ మాట్లాడుతూ.. ‘మెడ భాగంలో కుక్కలు బ లంగా కరవడంతో అక్కడ ఉన్న ప్రధాన రక్తనాళంలో రక్తం గడ్డకట్టింది. దీనివల్ల రక్తప్రస రణ ఆగిపోయి పక్షవాతం వచ్చింది.
ఫలితంగా శరీరం కుడి భాగం పడిపోయింది. వెంటనే బ్లడ్-థిన్నర్ మందులు, ప్రత్యేక ఫిజియోథెరపీ అందించడంతో బాలుడు న్యూ రోలాజికల్ సమస్యల నుంచి అద్భుతంగా కోలుకున్నాడు‘ అని వివరించారు. చికిత్సలో కన్సల్టెంట్ ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ బి. కృష్ణ చైతన్య పాల్గొన్నారు.






