యూనియన్ల సమష్టి కృషితో కార్మికుల పనివేళల్లో మార్పు
18-04-2026 12:25 AM
ఇల్లందు టౌన్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): పారిశుద్ధ్య కార్మికుల పనివేళల్లో మార్పు వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇల్లందు సింగరేణి, మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పనివేళల్లో మార్పు చేశారు. యూనియన్ల విజ్ఞప్తి మేరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న విధులను శనివారం నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు మార్చడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
జెకె సివిల్ విభాగంలో నిర్వహించిన సమావేశంలో యాకుబ్ షావలి మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యూనియన్ల కృషితో సాధ్యమైన ఈ మార్పుకు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, కమిషనర్ గణేష్, జిఎం వీసం కృష్ణయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.






