calender_icon.png 31 July, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు సినిమా ఉచిత ప్రదర్శన

30-07-2025 08:14:41 PM

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని చక్కగా వివరించి హిందూ ఐక్యత గురించి తెలియజేసే సినిమా హరిహర వీరమల్లు కాబట్టి బిజెపి కార్యదర్శి బచ్చు వంశీ సహకారంతో ఈ సినిమా నాలుగు షోలు ఫ్రీగా ప్రదర్శించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉచిత టికెట్లను ప్రజలకు అందించి కేక్ కట్ చేసి సినిమా ప్రదర్శనలో పాల్గొన్న ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ.. సనతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు కట్టుబొట్టు నేర్పించాలని హిందువుల ఐక్యతకు అందరూ ముందడుగు వేయాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమ స్పాన్సర్ బచ్చు వంశీ మాట్లాడుతూ, నేను ఈ సినిమా చూసిన వెంటనే ఇది ప్రతి ఒక్క హిందువుకు చూపించాలని తపనతో నా వంతుగా ఈ సినిమా థియేటర్లలో నాలుగు షోలు ఫ్రీగా చూపించడానికి సహకరించిన తాకేసి యాజమాన్యానికి బిజెపి పట్టణ కార్యవర్గానికి సీనియర్ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు నాయకులు వేములవాడ పట్టణ ప్రజలు పాల్గొన్నారు