calender_icon.png 31 July, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినిలకు ఇబ్బందులు లేకుండా చూడాలి

30-07-2025 08:17:21 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యార్థినిలకు గురుకుల విద్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కేసముద్రం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి(Municipal Commissioner Prasanna Rani) సూచించారు. బుధవారం కేసముద్రం పట్టణంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల విద్యాలయాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకులంలో తరగతి గదులు, డార్మెటరీ, వంటగది, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్య బోధన, వసతి, భోజనం అల్పాహారం అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుజాత పాల్గొన్నారు.