15-11-2025 12:13:44 AM
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 14, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారాయి విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తాకుతున్న దృశ్యం. పాల్వంచ పట్టణ పరిధిలోని శాస్త్ర రోడ్లో గల కృతంగం రెస్టారెంట్ సమీపంలో విద్యుత్ తీగల కు చెట్ల కొమ్మలు అల్లుకొని ఉన్నాయి. దీంతో చెట్లకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి దృశ్యాలను పరిశీలించి ఎప్పటికప్పుడు కొమ్మలను విద్యుత్ తీగలకు తగలకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. విద్యుత్ శాఖ అధికారులు అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కొమ్మలు వేపుగా పెరిగి విద్యుత్ తీగలను తాకుతున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో నంటూ స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తక్షణమే కొమ్మలను నరికి ప్రమాదాన్ని నివారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.