8 July, 2026 | 1:53 AM

ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ

08-07-2026 12:00 AM

జనగామ, జులై 7( విజయక్రాంతి): అధిక సాంద్రత పత్తి సాగుతో రైతులకు దిగుబడి పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి అంబిక సోనీ అన్నారు. నేషనల్ మిషన్ ఆన్ కాటన్ లో భాగంగా ఉచితంగా పత్తి విత్తనాలను  తరిగొప్పుల మండల కేంద్రంలో గల రైతు వేదికలో రైతులకు అందజేశారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి అంబిక సోని మాట్లాడుతూ.. దగ్గర వరుసల సాగు పద్ధతి అనుసరించడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు. మండలం వ్యాప్తంగా 300 ఎకరాలకు పత్తి విత్తనాలు అందజేశామన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ అధికారులు ఏవో మోహిత్, ఏఈఓ వినయ్ సర్పంచులు, అర్జుల జ్యోతి, కుర్రె మల్లయ్య, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.