గాంధీనగర్ వాసికి డాక్టరేట్
08-07-2026 12:00 AM
భీమదేవరపల్లి, జూలై 7 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి సౌజన్య పశ్చిమబెంగాల్లోనీ ఖరగ్ పూర్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకుంది. ’ ఛానల్ ఎస్టిమేషన్ ఫర్ డ్యూయల్ వైడ్ బ్యాండ్ టెరాహెరట్జ్ అల్ట్రా మాసివ్ మిమో సిస్టమ్స్ 6జీ కమ్యూనికేషన్స్ ’ అనే అంశం పై ప్రొఫెసర్ దెబరతి సెన్ పర్యవేక్షణలో పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్ జి ఎస్ సన్యాల్ స్కూల్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు సంజన కు డాక్టరేట్ అందించారు. సౌజన్య బిటెక్ జెఎన్ టి యు అనంతపూర్, ఎంటెక్ ఐఐటీ హర్యానా లో చదివింది.






