8 July, 2026 | 2:39 AM

పశు ఔషధ బ్యాంక్‌నకు ఐదు వేల ఔషధాల విరాళం

08-07-2026 01:52 AM

కోదాడ, జూలై 7 :కోదాడ పట్టణం ప్రాంతీయ పదువైద్యశాలలోని పశు ఔషధ బ్యాంక్ నకు కోదాడ పట్టణ వాసి పందిరి సత్యనారాయణ ఐదు వేల రూపాయల పశు ఔషధాలను మంగళవారం విరాళంగా అందించారు. దాత సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య మూగ జీవాల ప్రాణ సంరక్షణకు చేస్తున్న అవిరామ కృషి తనను ఎంతగానో ఆకర్షించిందని,

జీతం కోసం ఏదో సమయం ప్రకారం పని చేసి వెళ్లిపోతున్న వారెందరో ఉన్న ఈరోజుల్లో ఉద్యోగానికి మించి కష్టానికి వెరవకుండా నిత్య వైద్యంతో పాటు పశుపోషకులకు పెట్టుబడి తగ్గించి పశుపోషణ లాభాల బాటలో నడిపించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మనపట్టణంలో అందిస్తున్న సేవలకు సహాయంగా పశు ఔషధాలను విరాళంగా అందించడం జరిగింది అన్నారు. కార్యక్రమములో అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య, వెటరినరీ అసిస్టెంట్ సర్జన్ డా సిరిపురం సురేందర్ , సిబ్బంది బి శివ, చంద్రకళ పాల్గొన్నారు.