10 April, 2026 | 4:02 AM

పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల శిబిరం

12-02-2026 07:11 PM

చిట్యాల,(విజయక్రాంతి): ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. గురువారం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని  ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో  కంటి పరీక్షల శిబిరం గురువారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో హాస్పిటల్ వాళ్లు పాల్గొని  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్  నర్రా సురేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎన్ యాదయ్య , ఉపాధ్యాయులు  ఎం. నీరజ, పి.చంద్రయ్య, ఎ.నరసింహ, అనిస్ఫాతిమా సుల్తానా, పెంటయ్య తదితరులు   పాల్గొన్నారు.