calender_icon.png 16 June, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత కంటి వైద్య శిబిరం

16-06-2025 01:04:01 AM

వలిగొండ,జూన్15(విజయక్రాంతి)వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో ఉషోదయ లేజర్ కంటి ఆసుపత్రి  ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 85 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి అతి తక్కువ ఖర్చులకే కంటి అద్దాలు పంపిణీ చేస్తామని వారు తెలి పారు.

ఆపరేషన్ అవసరమైన వారికి 25 వేల రూపాయల విలువ గల కంటి ఆపరేషన్లను 10 వేల రూపాయలకే చేస్తామని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వా రు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమన్, డాక్టర్ సికిందర్, వైద్య సిబ్బంది రోమన్, రాణి, దివ్య తదితరులు పాల్గొన్నారు.