23 June, 2026 | 11:23 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

మంథని ప్రాంత ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం

03-04-2026 06:56 PM

40ఏండ్లుగా మా   కుటుంబానికి మీరు సేవే చేసే అవకాశం కల్పించడం మా అ మా అదృష్టం

ముత్తారంలో మాజీ స్పీకర్ శ్రీపాద రావు ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు

మంథని,(విజయక్రాంతి): మంథని నియోజక వర్గ ప్రాంత ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యమని, 40 ఏండ్లుగా మా కుటుంబానికి మీరు సేవే చేసే అవకాశం కల్పించడం మా అదృష్టమని ముత్తారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు స్మారకర్థం  ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ కు చెందిన పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ముత్తారం జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా  జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి తో కలిసి శ్రీనుబాబు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి శ్రీపాదరావు ఆశయాలను కొనసాగించేందుకు మంథని ప్రాంత ప్రజలకు నిత్యం సేవ చేయడమే తమ కుటుంబ బాధ్యత అని, బాధలో ఉన్నవారు తమకు ఫోన్ చేస్తే మేము బాధ్యతగా వారికి సేవలు అందించడం మా బాధ్యత అని శ్రీనుబాబు తెలిపారు. పెద్దపల్లి 

డిసిపి, గోదావరిఖని ఏసిపి, ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు చొప్పరి సదానందం, బాలాజీ, జగన్ మోహన్ రావు మండల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కృషి చేశారని కొనియాడారు. వారి సహకారంతోనే పేద ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. ఈ వైద్య శిబిరంలో అవసరం ఉన్నవారికి ఆపరేషన్ చేయబడునని, నాణ్యమైన కండ్ల అద్దాలు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ ఉచిత క్యాంపు శనివారం కూడా కొనసాగుతుందని మండలంలోని ప్రతి ఒక్కరు ఈ కంటి వైద్య శిబిరంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బీదవారికి ఉచిత సేవలు అందిస్తున్న పుష్పగిరి వైద్య బృందానికి అభినందనలు: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాద రావు స్మారకర్థం గ్రామీణ ప్రాంతాల్లోని బీదవారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న పుష్పగిరి వైద్య బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందనలు తెలిపారు. ముత్తారంలో ఉచిత వైద్య  కంటి శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమని మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ శిబిరానికి మొదటి రోజు భారీ స్పందన వచ్చింది దాదాపు 1000 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.