23 June, 2026 | 10:09 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఆరోగ్యశ్రీలో అరుదైన ఉచిత వైద్యం

03-04-2026 06:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని దేవేందర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో పేద కుటుంబానికి ఉచితంగా ఆరోగ్యశ్రీలో అరుదైన వైద్యం అందించినట్టు డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వివరాలు వెల్లడించారు. కుంటాల మండలం అందాపూర్ గ్రామానికి చెందిన కల అనే మహిళ ఏడు నెలల గర్భవతితో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మానస్థితికి చేరుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆరోగ్యశ్రీలో చేర్చుకొని వైద్యం అందించడం జరిగింది.

జనరల్ సర్జన్ దేవేందర్ రెడ్డి స్త్రీ శైలజ. అశ్విన్ సతీష్ మరో ఇద్దరు వైద్యుల సహకారంతో ఐ రిస్క్ ఆపరేషన్ చేసినట్టు తెలిపారు. 700 గ్రాముల బాబు జన్మించడంతో పిల్లల వైద్యుల నిపుణుల పర్యవేక్షణలో బాబులు కాపాడునట్లు తెలిపారు. తల్లి బిడ్డలకు 29 రోజులు ఆస్పత్రిలో ఆరోగ్య సేవలు అందించడంతో వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వారిని శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. ఈ వైద్య సేవలకు ప్రవేట్ లో పది లక్షల వరకు అయ్యేదని తమ దేవేందర్ రెడ్డి హాస్పిటల్ లో ఉచితంగా అందించామని పేర్కొన్నారు. వైద్యం అందించిన డాక్టర్ దేవేందర్ రెడ్డి వైద్య బృందానికి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు