31 May, 2026 | 11:24 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

తిప్పారం సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

11-04-2026 09:28 PM

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం గ్రామంలో గ్రామ సర్పంచ్ సోలంకి ప్రమోద మాధవరావ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు గ్రామస్థులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సోలంకి ప్రమోద మాధవరావ్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రముఖ ఆసుపత్రి వైద్యులచే వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలందరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలక వర్గం, పంచాయతీ కార్యదర్శి అరుణ్, స్థానిక కాంగ్రెస్ నాయకుడు సోలంకి మాధవరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.