calender_icon.png 27 June, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ జర్నలిస్ట్ మునిర్ జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరం

26-06-2025 09:49:24 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్ట్ మునిర్ జ్ఞాపకార్థం ఈ నెల 29న రామకృష్ణాపూర్ పట్టణంలో రెనె కరీంనగర్ ఆసుపత్రి(Renee Karimnagar Hospital) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ... సీనియర్ జర్నలిస్ట్ మునిర్ కోల్ బెల్ట్ ప్రాంతనికి ఎనలేని సేవలు అందించడం జరిగిందని కొనియాడారు. ఆయన జ్ఞాపకార్థం ఈనెల 29న పట్టణంలోని అంగడి బజార్ ఏరియాలోని సింగరేణి క్లబ్ లో ఉదయం 9 గంటల నుండి మొదలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొంటారాని పేర్కొన్నారు.

పేదలకు ఉచితంగా మెగా వైద్య సేవలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ శిబిరంలో ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, కార్డియాలజీ, కార్డియో తోరసిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ, పలమనాలజీ,  జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్, స్పైన్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, మదర్ అండ్ చైల్డ్ కేర్, లాప్రోస్కోపిక్ సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్ మొదలగు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించబడునని తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో రెనె హాస్పిటల్ జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్, మార్కెటింగ్ మేనేజర్ అభిలాష్ రెడ్డి, వసీముద్దీన్, శంకర్, పాషా, సారయ్య, రాజేందర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.