నీట్ పరీక్షకు ఆర్టీసీ ఉచిత బస్సులు
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఈ నెల 21న జరగబోయే నీట్ రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపించి పరీక్షా కేంద్రాలకు, పరీక్ష రాసిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకునేలా ఉచిత సేవలను పొందవచ్చన్నారు. ఏసీ సర్వీసులు మినహా యించి అన్ని బస్సుల్లో అందుబా టులో ఉంటుందన్నారు.
73 వేల మం ది అభ్యర్థులు హాజరవుతున్న నేపథ్యం లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాలలో తగినన్ని బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 21న మొదటి సర్వీసు నుంచి అర్థరాత్రి వరకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆటంకాలు ఎదురైతే 040-23450033, 68153333 సంప్రదించాలని సూచించారు.






