09-05-2025 12:02:44 AM
జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్
మంచిర్యాల, మే 8 (విజయక్రాంతి): తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ డిపార్ట్మెంట్ (టాస్క్) ద్వారా ఉపాధి సామర్థ్యాన్ని పెంచే నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నారు.
గురువారం కలె క్టరేట్‌లోని టాస్క్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి టాస్క్ అధికారి సాయికుమార్‌తో కలిసి హాజరై మాట్లాడా రు. 30 రోజుల పాటు అర్హత గల యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను అందిం చి వారి ఉపాధి అవకాశాలను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు.
శిక్షణ మొదటి విడతలో ఎంపికైన 40 మంది నిరుద్యోగ యువతకు శిక్షణలో భాగంగా సి, సి++, జావా, పైథాన్, ఆప్టిట్యూడ్ రీజనింగ్ (ఎ&ఆర్), ఇంటర్వ్యూ నైపుణ్యాలలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.
శిక్షణ కార్యక్రమం అనంతరం నైపుణ్యత గల అభ్యర్థులకు ఉపాధి అవకాశానికి సహాయం అం దుతుందని, అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొం దాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షకుడు శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.