calender_icon.png 9 May, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు అభినందన

09-05-2025 12:02:25 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్ మే 8: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవడమే కాకుండా క్రీడలు, వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టి సమతుల్యతను పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.ఇటీవల వచ్చిన 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో  జిల్లాలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు గురువారం ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో అభినందన,సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు బోధిస్తారని అందువల్లనే విద్యార్థులు మంచి మార్కులు సాధించారని అభినందించారు. విద్యార్థులకు ఇది ప్రారంభం మాత్రమే అని భవిష్యత్తులో చదువుతో పాటు వ్యాయామం, క్రీడల్లో పాల్గొంటూ చదువుతో పాటు ఆరోగ్యాన్ని సమతుల్యతను పాటించాలని సూచించారు.

జిల్లా నుండి ఉత్తమ మార్కులు పొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు సైతం కలెక్టర్ చేతుల మీదుగా మొత్తం 50 మంది విద్యార్థులకు సన్మానం చేశారు.విద్యార్థులకు మెమెంటో తో పాటు వారి జీవితంలో ఉత్తేజపరిచే విధంగా ఎ.పి. జె కలాం రాసిన ఇగ్నేటెడ్ మైండ్స్ పుస్తకాని బహుకరించారు.

జిల్లా విద్యా అధికారి అబ్దుల్ గని, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి ఎ.అంజయ్య,ఏ. సి. జి గణేష్, మండల విద్యా అధికారులు, ప్రినిపాల్స్, విద్యార్థులు,  వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.