17-01-2026 08:00:57 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్ లు ఖరారు అయ్యాయి. శని వారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్ డీ ఓ శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో 34 వార్డులు, చెన్నూర్ మున్సిపల్ పరిధిలో 18 వార్డులు, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో 22 వార్డులు, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో 15 వార్డులకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, జనరల్ మహిళ, జనరల్ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.