27-06-2025 01:26:48 AM
బెజ్జుర్, జూన్26(విజయక్రాంతి): ఇటీవల కోతులు విపరీతంగా పెరగడంతోపాటు పిల్ల ల, పెద్దలపై దాడులు పెరిగిపోయాయి. దీంతో గ్రామస్తులందరూ ఒకటే నిర్ణయానికి వచ్చా రు. కోతులను పట్టించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని నిర్ణయించుకున్న వారు పలువురి సహకారంతో నిధులు సేకరించారు.
గ్రామస్తులు, నాయకుల సహకా రంతో అధికారులు కోతులను పట్టుకునే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి ప్రత్యేక బృందాన్ని తెప్పించి కోతులను పట్టిస్తున్నారు. పట్టుకున్న ప్రజలను మహారాష్ట్రలోని అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మరో మూడు రోజులపాటు గ్రామంలో కోతులను పట్టుకోవడం జరుగుతుందని బృందం సభ్యులు తెలిపారు.