25-07-2025 01:10:14 PM
ముత్తారం తాసిల్దార్ మధుసూదన్ రెడ్డి
ముత్తారం, (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలతో మండలంలోని పారుపల్లి గ్రామానికి చెందిన (21) మంది చెంచు కుటుంబములకు (Birth) బర్త్ సర్టిఫికేట్లు జారీ అయినందున. వారందరికీ ఆధార్ జారీ చేయుట నిమిత్తం, ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభించామని తాసిల్దార్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 50 ఏండ్లు గా పారుపల్లిలోని 25 మంది చెంచు కుటుంబాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు లేవని, దీంతో వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పటికి అందరం లేదని తాసిల్దార్ తెలిపారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) పారుపల్లి గ్రామాన్ని సందర్శించగా చెంచు కులాల వారు వారి పరిస్థితి తెలుపగా, వెంటనే స్పందించిన కలెక్టర్ గ్రామంలోని ఆధార్, రేషన్ కార్డులు లేని వారిని గుర్తించి వారికి ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని అదేశించారని, గత వారం రోజులుగా గ్రామంలోని ఆధార్, రేషన్ కార్డులు, ఎలాంటి గుర్తింపు కార్డు లేని వారిని గుర్తించి, వారికి భర్త సర్టిఫికెట్లతో పాటు ఆధార్, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తాసిల్దార్ తెలిపారు. ఆయన వెంట ఆర్ఐ సిబ్బంది ఉన్నారు.