పత్రికా స్వేచ్ఛతోనే ప్రజస్వామ్య మనుగడ
24-05-2024 02:18 AM
నిజామాబాద్, మే 2౩ (విజయక్రాంతి): పత్రికా స్వేచ్ఛతోనే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమని ప్రెస్‌అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. టీయీడబ్ల్యూజే ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్‌లో ‘ప్రజాస్వామ్యం మీడియా’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్‌కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సదస్సులో కవి నందిని సిధారెడ్డి, టీయూడబ్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌రెడ్డి, సూర్యనారాయణ, ఉర్డూ అకాడమీ చైర్మన్ తాహెర్ పాల్గొన్నారు.
-ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి






