16 August, 2026 | 8:16 AM

అవినీతి ఉద్యోగికి జైలు శిక్ష

24-05-2024 02:20 AM

కరీంనగర్, మే 23 (విజయక్రాంతి) : విధులను విస్మరించి లంచం డిమాండ్ చేసిన కేసులో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ ఉద్యోగి ఒకరికి జైలు శిక్ష పడింది. రామడుగు మండలం వెలిచాల గ్రామస్తుడు శ్రీనివాస్.. 2013లో ఫర్టిలైజర్ షాపు పర్మిషన్ కోసం వ్యవసాయ శాఖ కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నాడు. ఆ దరఖాస్తును పరిశీలించి, ఏడీ కార్యాలయానికి నివేదించాల్సి ఉండగా, తాత్సారం చేస్తూ చివరకు ఆఫీసు ఉద్యోగి అన్నారెడ్డి ప్రణవేందర్ రెడ్డి  అర్జీదారు శ్రీనివాస్ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. శ్రీనివాస్ ఏసీబీ ఆశ్రయించాడు. ఏసీబీ సూచనల మేరకు అన్నారెడ్డితో రూ.3వేలు ఇస్తానని అంగీకరించి, అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండె డ్‌గా పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో అన్నారెడ్డిపై నేరం రుజువు కావడంతో జడ్జీ కుమార్ వివేక్ శ్రీనివాస్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు.