10 April, 2026 | 4:51 PM

Breaking News

సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •   మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్— లొంగిపోయిన 42 మంది కీలక మావోయిస్టులు   •   కాలభైరవ ఆలయంలో పూజలు   •  

ప్రభుత్వ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ సందడి

19-09-2025 10:25 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా జరిగింది. సీనియర్ విద్యార్థులు కొత్తగా అడుగుపెట్టిన జూనియర్లకు ఆతిథ్యం ఇస్తూ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సంగీతం, నృత్యం, నాటికలు, వినోదాత్మక ఆటలతో వేదిక కళకళలాడింది. ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఫ్రెషర్స్ తమ ప్రతిభను ప్రదర్శించి అందరి మెప్పు పొందారు. చివరగా డీజే మ్యూజిక్‌తో విద్యార్థులు ఉత్సాహంగా నృత్యం చేసి సందడిని మరింత పెంచారు. సీనియర్స్ జూనియర్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనగా “కలిసి ముందుకు సాగుదాం” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.