19-09-2025 10:23:10 PM
వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుస్తానారి సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు సంబంధించిన అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం చిన్నపిల్లల వైద్య నిపుణులు ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేశారు. గ్రామపంచాయతీ ఆలబాక నుండి ఏదిర గ్రామపంచాయతీ సిబ్బందికి ఈరోజు స్వచ్ఛత హీ సేవ స్వేచ్ఛ ఉత్సవంలో భాగంగా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోరం క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాతా శిశువు సంరక్షణ వైద్యాధికారి భాస్కర్, గ్రామపంచాయతీ సెక్రటరీ శృతి, వారి సిబ్బందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదిర తీసుకొని రావటం జరిగింది.