03-12-2025 12:35:02 AM
వరంగల్ జిల్లా మురిపిరాలలో ఏకగ్రీవంగా ఎన్నిక
మహబూబాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఆరేళ్లుగా గ్రామ పంచాయతీలో కారోబార్‌గా విధు లు నిర్వహిస్తూ, సర్పంచు చెప్పిన పనులు చేస్తూ వచ్చిన కారోబార్.. అనూహ్యంగా సర్పంచ్ అభ్యర్థి కావడమే కాకుండా గ్రామస్థుల ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మురిపిరాల గ్రామ సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. గ్రామస్తులంతా ఏకాభిప్రాయంతో ఇప్పటివరకు కారోబార్‌గా విధులు నిర్వహిస్తున్న పెదగాని నాగరాజు సర్పంచ్ అయితే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని భావించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నేతలు కూడా ఏకతాటిపైకి వచ్చి నాగరాజును ఏకగ్రీవ సర్పంచుగా బలపరిచారు.
దీనితో గ్రామంలో ఉన్న ఎనిమిది వార్డు సభ్యుల పదవులను కాంగ్రెస్ మూడు, బీఆర్‌ఎస్ మూడు, బీజేపీ రెండు తమ పార్టీకి చెందిన సానుభూతిపరులకు ఇవ్వాలని నిర్ణయించి ఆ మేరకు ఏకగ్రీవంగా వార్డు సభ్యులను కూడా ఎంపిక చేసి ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే వేయించారు. బుధవారం అధికారులు ఎన్నికను అధికారులు లాంఛనంగా ప్రకటించనున్నారు.