23-06-2025 12:53:55 AM
ఆపరేషన్ సింధు ద్వారా తరలింపు
న్యూఢిల్లీ, జూన్ 22: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ఠ్యా అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టింది. ఇప్పటికే ఇరాన్‌లో ఉన్న 1428 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 311 మందితో కూడిన విమానం ఇరాన్‌లోని మష్‌హద్ నుంచి ఆదివారం ఢిల్లీకి చేరుకుంది.
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ముందడుగేసింది. 160 మంది భారతీయులతో కూడిన విమానం ఆదివారం జోర్డాన్ నుంచి బయలుదేరినట్టు ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. 160 మంది భారతీయులు జోర్డాన్ బోర్డర్‌కు చేరుకోగా ఆపరేషన్ సింధు ద్వారా వారిని భారత్‌కు తీసుకొస్తున్నారు.