ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
02-03-2026 01:16 AM
ఎల్లారెడ్డి, మార్చ్ 1 (విజయక్రాంతి): బిజెపి రాష్ట్ర నాయకులు జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ పైడి ఎల్లారెడ్డి జన్మదిన వేడుకలను ఎల్లారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పైడి ఎల్లారెడ్డి జన్మదినం జైహీరాబాద్ పార్లమెంటు ప్రజలకు ఎంతో సంతోషకరమని,పలువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయన జన్మదిన వేడుకలకు ఎల్లారెడ్డి పట్టణంలోని, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నరసింహులు, పట్టణ అధ్యక్షుడు రాజేష్, అన్న సాగర్ వెంకటరెడ్డి, బత్తిని దేవేందర్, రాజ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.




