13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వేములవాడలో బోటింగ్ కోసం నిధులు

08-01-2026 12:25 AM

పలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషి

1 కోటి 40 లక్షలునిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అసెంబ్లీ లో మాట్లాడిన రెండు రోజుల్లోనే నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు, భక్తులు, పర్యాటకులు

రాజన్న సిరిసిల్ల, జనవరి 7 (విజయక్రాంతి): జిల్లాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.1 కోటి 40 లక్షల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన అనుభూతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని పలు మార్లు కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా గుడి చెరువులో బోటింగ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపగా,రెండు రోజుల క్రితం అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు త్వరలోనే బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఆ హామీకి అనుగుణంగానే మంగళవారం. 07/01/2026)గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు కోసం రూ.1.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పత్యేక కార్యదర్శి జయేష్ రంజాన్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసారు.

ఈ నిర్ణయంతో వేములవాడ పట్టణ ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్ ఏర్పాటు ద్వారా పర్యాటక ఆకర్షణ పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు. వేములవాడ పట్టణంలో ఒక వైపు 150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ,47 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో నేడు బోటింగ్ ఏర్పాటు కోసం ప్రభుత్వo 1 కోటి 40 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో వేములవాడ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా అసెంబ్లీ లో రాజన్న ఆలయ గుడి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయాలని కోరిన రెండు రోజుల్లోనే 1 కోటి 40 లక్షల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణ రావులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని విప్ పేర్కొన్నారు.