calender_icon.png 11 January, 2026 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే స్టెనోగ్రాఫర్లకు ‘జీవితకాల సాఫల్య పురస్కారం

08-01-2026 12:25:17 AM

పాల్గొన్న డా.మర్రి రాఘవయ్య

సికింద్రాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): స్టెనోగ్రాఫర్లు దైవంగా భావించే సర్ ఐజాక్ పిట్మన్ స్మారకార్థం బుధవారం సికింద్రాబాద్లోని రైల్వే క్రీడా ప్రాంగణంలో (ఆర్‌ఎస్సి)లో దక్షిణ మధ్య రైల్వే స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ చారిత్రాత్మక వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్‌ఎఫ్‌ఐఆర్/ ఎస్సిఆర్‌ఇఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.రాఘవయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం జోనల్ అధ్యక్షులు టి.అనిల్ కుమార్,జోనల్ కార్యదర్శి జె. రామకృష్ణ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎం.రాఘవయ్య ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలో సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దా లుగా స్టెనోగ్రాఫర్ల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఏడుగురు ప్రముఖ స్టెనోగ్రాఫర్లకు ‘జీవితకాల సాఫల్య పురస్కార జ్ఞాపిక‘, సన్మాన పత్రం అందజేసి సత్కరించారు.