22 April, 2026 | 1:18 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిధులు మంజూరు

02-07-2025 12:48 AM

జిల్లా కలెక్టర్

కొత్తగూడెం, జూలై 1 (విజయ క్రాంతి ) జిల్లా కేంద్రం కొత్తగూడెంలో గల ఇంటర్మీడియట్ బోర్డ, తెలంగాణ ప్రభుత్వ జూని యర్ కళాశాల, కు అత్యవసర మరమ్మత్తు ల నిమిత్తం కలెక్టర్ చితేశ్వి పాటిల్ రూ 58 లక్షల మంజూరు చేశారు.మంగళవారం ఆయన కళాశాలను సందర్శించి, మంజూరైన ఈ నిధులతో కళాశాలలో అత్యవస రంగా చేయవలసిన మరమత్ పనులను పరిశీలించారు.

సైన్స్ పాక్టికల్ ల్యాబ్స్ రెనవేషన్, కంప్యూటర్ ల్యాబ్ సామాగ్రి,ఎలక్ట్రికల్ ల్యాబ్ సామాగ్రి , బాలురా,బాలికల టాయ్ లెట్స్ మైనర్ రిపేర్ , తరగతి గదుల్లో విద్యుదీకరణ, తాగునీటి పైపు లైన్ , తరగతి గదుల తలుపులు, కిటికీలు, సీలింగ్ ఫ్యాన్స్, తదితర పనులను తనిఖీ చేసి, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ కళా శాల ఆవరణలోనే వున్న జిహెచ్ స్, చుంచుపల్లి, తరగతి గదులను కూడా రిపేర్, కిచెన్ షెడ్ నిర్మాణమునకు అనుకూలతను పరిశీలించారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కత్తి రమేష్ , ఇన్ చార్చి ఇంటర్మీడియట్ బి. సులోచనారాణి,విద్యాదికారిణి హైస్కూల్ హెచ్.ఎం ఆర్. సబితా సంధ్యారాణి పంచాయితీరాజ్ ఈ ఈ శ్రీనివాస్ , డి ఈ నాగేందర్ పాల్గొన్నారు.