calender_icon.png 2 July, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలి

02-07-2025 12:47:25 AM

ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి

కొత్తగూడెం, జూలై1 (విజయ క్రాంతి )స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఖమ్మం ఎంపి రామ సహాయం రఘు రాంరెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. మంగళవారం లక్ష్మిదేవిపల్లి మండలం బంగారు చెలక, మైలారం, గట్టుమల్ల, రేగళ్ల, లక్ష్మిదేవిపల్లి, చాతకొండ, సీతారాంపురం, తెలగరామవరం, హేమచంద్రాపురం ఉమ్మడి పంచాయతీల పరిధిలో,స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎం పి మాట్లాడుతూ, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, 10ఏళ్ళు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ కు గత ఎన్నికల్లో ఎలా బుద్ది చెప్పరో, స్థానిక ఎన్నికల్లో కూడా అదే పునరావృతం కావాలని, పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.22వేల కోట్లతో రైతు భరోసాను అమలు చేసిందని, రూ. 12వేల కోట్లతో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తోందని, 55 లక్షల ఇండ్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఉచిత బస్సు పథకానికి 4 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.

గతంలో పదేళ్లు ఉన్న బీఆర్‌ఎస్, చేసిందేమీ లేదని, విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, తోము చౌదరి ,పెద్దబాబు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి గౌస్ పాషా, మాజీ పాక్స్ డైరెక్టర్ కూచిపూడి జగన్, ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్స్ ఎండి రజాక్, పితాంబరం, రైల్వే బోర్డు మెంబెర్ శ్రీనివాస్ రెడ్డి, టెలికం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు,తదితరులు పాల్గొన్నారు.