17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మావోయిస్టు అగ్రనేత అడెల్లు అంత్యక్రియలు

10-06-2025 12:00 AM

అదిలాబాద్, జూన్ 9 (విజయక్రాంతి):  మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌కు విరసం నేతలు లాల్ సలాం చెబుతూ ఉద్యమ వీడ్కోలు పలికారు. బీజాపూర్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు మృతదేహం ఆదివారం రాత్రి ఆయన స్వగ్రామమైన బోథ్ మండలం పొచ్చరకు చేరుకుంది.

30 ఏళ్ల కిందట గ్రామం విడిచి అడవి బాట పట్టి ఇప్పుడు విగతజీవిగా గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం నిర్వహించిన అడెల్లు అంత్యక్రియల్లో కమ్యూనిస్ట్ నాయకులు, విరసం నేతలు, పౌర హ క్కుల సంఘం నేతలు, వివిధ ప్రజా సంఘా ల నాయకులు తరలివచ్చారు. అలాగే అడె ల్లు అంత్యక్రియల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు.

అడెల్లు మృతదేహానికి నివాళ్ళు అర్పించి, వారి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. కామ్రేడ్ అడెల్లు కుటుంబాన్ని ప్రభుత్వం అదుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తా ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ పేరుతో అమాయక బహుజనులను హతమరుస్తోందని ఆరోపిం చారు. మావోయిస్టు లతో చర్చలు జరిపి వా రి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.