ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావం
మంచిర్యాల, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ట్రోపాధ్యాయ సంఘం 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వ హించారు. స్థానిక ఎస్టీయూ భవన్‌లో జరిగిన వేడుకలలో ఎస్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు మాట్లా డుతూ.. నిజాం నుంచి ఒకే విధానం, ఒకే సిద్ధాంతం, ప్రశ్నించడం, పోరాడడం మొద లైన ఉద్యమాల ద్వారా అంతిమంగా విద్యా ఉపాధ్యాయ రంగ శ్రేయస్సు కోసం మడమ తిప్పకుండా పనిచేయడం ఎస్టీయూ సం ఘం లక్ష్యం అని ఆయన అన్నారు.
అనంత రం జిల్లా రెండవ కార్యవర్గ సమావేశంలో భాగంగా తన ప్రధాన కార్యదర్శి నివేదికను సభ ముందుంచి ఆమోదింపజేశారు. జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎం సుమన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్య క్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీపెల్లి బాపు, జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు అర్చనపల్లి సత్తయ్య, జిల్లా కార్యదర్శి డి స్వప్న దేవి, ఆర్థిక కార్యదర్శి డి గంగుతాయి, మంచిర్యాల మండల అధ్యక్షులు మల్లేశం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






