ఇబ్రహీంపట్నం పీఎస్‌ను తనిఖీ చేసిన ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి
ఇబ్రహీంపట్నం, జూన్ 30(విజయక్రాంతి):ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి, ఐపీఎస్ మంగళవారం ఇబ్రహీంపట్నం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లలోని రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్షి యాప్ వినియోగాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేరాలను అదుపు చేయాలని అధికారులను ఆదేశించారు.
బాధితులకు సత్వర న్యాయం అందిస్తూ, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. అనంతరం పోలీస్ క్వార్టర్స్ను సందర్శించి, సిబ్బంది సంక్షేమం, వసతులపై ఆరా తీశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి, ఏసీపీ కె.వి.పి.రాజు, సీఐలు ఎం.మహేందర్ రెడ్డి, సి.హెచ్. జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






