15-08-2025 12:32:34 PM
మన ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు స్వాతంత్ర ఫలాలు అందించాలి.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు,(విజయక్రాంతి): దేశభవిష్యత్తు బాలలపైనే ఆధారపడి ఉందని బాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Munugode MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం 79 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించి మాట్లాడారు.ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మన కోసం మనం ఎంత ఆలోచిస్తామో దేశం కోసం కూడా ఆలోచించి దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలిని అన్నారు. ప్రతి ఒక్కరూ కర్తవ్యం గా మనకోసం మన దేశం కోసం పని చేసినట్లయితే రాబోయే రోజుల్లో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుంది. దేశ స్వాతంత్రం కోసం లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. స్వాతంత్ర ఫలాలను భావిభారత పౌరులకు అందించాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరి పైన ఉంది అన్నారు.ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మునుగోడు నియోజకవర్గం నలుమూలల నుండి హాజరైన కార్యకర్తలు ,నాయకులు ఉన్నారు.