గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలి
ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
తాడిచెర్లలో కార్నర్ మీటింగ్
భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
జయశంకర్ భూపాలపల్లి, మే 8 (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రం తాడిచెర్లలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన కార్న ర్ మీటింగ్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేశామని, మిగతా గ్యరేంటీలను త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు.
గడ్డం వంశీకృష్ణను రెండు లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. మల్హర్ మండలాన్ని అభివృద్ది చేసే పూర్తి భాద్యత తనదేనని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్హర్‌రావు, జెడ్పీటీసీ కోమల రాజిరెడ్డి, నాయకులు దండు రమేశ్, బడితెల రాజయ్య, కొండ రాజమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు.






