20 May, 2026 | 1:05 PM

రామ్‌చరణ్ ‘పెద్ది’ షూటింగ్ ముగింపు దశలో

22-04-2026 02:13 AM

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. ఇదే ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ మరో 6 రోజుల్లో పూర్తవనుంది. ఈ మేరకు చిత్రబృందం తాజాగా పంచుకున్న ఫొటోలు మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం విజయక్రాంతి న్యూస్‌ను సందర్శించండి

సెట్స్‌లో దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఉన్న ఈ కొత్త స్టిల్స్‌లో రామ్‌చరణ్.. పొడవాటి జుట్టు, గడ్డం, స్టైలిష్ షేడ్స్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతాన్ని కూడా ఆఖరి షెడ్యూల్‌లో షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ స్పెషల్ సాంగ్‌లో నటించే హీరోయిన్ అంటూ పూజాహెగ్దే, శ్రీలీల, సమంత, మృణాల్ ఠాకూర్, మానస వారణాసి, ఆయేషా ఖాన్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో మరో బ్యూటీ పేరు చేరింది. సంయుక్త మీనన్ ఈ సినిమాలోని ప్రత్యేక గీతంలో నటిస్తోందని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈ ప్రత్యేక గీతంలో రామ్‌చరణ్‌తో ఆడిపాడేదెవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాల్సిందే.