గుట్టలను కరిగిస్తున్న ఖద్దరు లీడర్లు..!
- నేల కూలుతున్న భారీ వృక్షాలు, కరుగుతున్న గుట్టలు
- భయాందోళనతో పరుగులు తీస్తున్న పక్షులు, జీవరాసులు
- జాతీయ రహదారి నిర్మాణం పేరుతో ఎర్రగుట్టలను ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు.
- రాత్రి పగలు నిర్వీరామంగా నడుస్తున్న యంత్రాలు
- పట్టించుకోని ఉన్నతాధికారులు
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రకృతి అందాలకు నెలువుగా, వాతావరణ సమతుల్యతకు అనుకూలంగా ఉన్న భారీ గుట్టలు, వృక్షాలు కద్దరు లీడర్ల చేతిలో కరిగి పోతున్నాయి. రాజకీయ నేతల స్వార్థ ప్రయోజ నాల కోసం, ఆయా ప్రాంత లీడర్ల స్వలాభం కోసం ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. 167 జాతీయ రహదారి నిర్మాణ ప నుల పేరు చెప్పి పగలు రాత్రి అని తేడా లే కుండా భారీ వాహనాలు టిప్పర్లు జెసిబి ల తో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లకు పడగలెత్తుతు న్న పరిస్థితి ఏర్పడింది.
నాగర్ కర్నూల్ జిల్లాలోని తాడూరు మండలంలో సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రగుట్ట, తూడుకుర్తి గ్రామంలోని పలుగు గుట్ట, ఎర్రమన్ను గుట్ట, పెద్దకొత్తపల్లి మండల పరిధి లోని కుమ్మరి గుట్ట, కోడేరు మండలంలోని ఎర్రగుట్ట, నాగర్ కర్నూల్ మండలం నర్సాయిపల్లి గ్రామంలోని ఎర్రగుట్ట, బిజినపల్లి మండలం శాయిన్ పల్లి గుట్టలు పూర్తిగా రాజకీయ నేతల చేతిలో ధ్వంసం అవుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు, రహదారుల నిర్మాణం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా గోతులు తవ్వి అట్టి మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇతర ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
అయినా సంబంధిత మైనింగ్, రెవెన్యూ పోలీస్ తదితర శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ అక్రమ దందా రోజురోజుకూ శృతి మించుతోందని స్థానిక పంట పొలాల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా ఎలాంటి తవ్వకాలు జరిపినా మైనింగ్ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంది కానీ అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినా ఆ శాఖ అధికారులు తమకేమీ పట్టినట్లు వ్యవహరించడం వెనక ఆంతర్యం ఏంటని రైతుల ప్రశ్నిస్తున్నారు.
కోట్లల్లో ఎర్ర మట్టి వ్యాపారం..!
జిల్లాలోని కొల్లాపూర్ కల్వకుర్తి నాగర్ కర్నూల్ నియోజకవర్గాల మీదుగా నూతనంగా నిర్మితం అవుతున్న 167 జాతీయ రహదారి నిర్మాణం పేరుతో అక్రమ మట్టి దందా నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయా పార్టీ ప్రధాన లీడర్ల అనుచరులు అనుయాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు నిత్యం వందల టిప్పర్ల ఎర్ర మట్టిని తవ్వి అమ్ముకుంటున్న పరిస్థితి. ఒక్కో టిప్పర్ ధర 15నుండి 18వేలు వసూళ్లు చేసుకుంటున్నారు.
లక్షల్లో నడుస్తున్న వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు జరగవద్దని రెవెన్యూ మైనింగ్ పోలీసు అధికారులను మేనేజ్ చేస్తున్నారని దాని ఫలితంగానే స్థానికంగా ఎలాంటి ఫిర్యాదులు అందిన ఎవరు పట్టించుకోవడంలే దని రైతులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా మట్టి మాఫియాను అరికట్టాలని ఆయా గ్రామాల సమీప రైతులు డిమాండ్ చేస్తున్నారు.






