22 April, 2026 | 7:59 AM

బీజేపీకి కాపులు అండగా నిలవాలి

09-05-2024 03:09 AM

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్

ఎల్బీనగర్, మే 8: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కాపులు అండగా నిలవాలని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోరారు. వనస్థలిపురంలో బుధవారం నిర్వహించిన కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేసుకోవద్దని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదని, సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెచ్చేది లేదని అన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని,  మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మూసీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.